దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మనం తినే తిండిపై ఖర్చు 50 శాతం తగ్గింది.. నమ్మలేకపోతున్నారు కదా...తాజా నివేదికలు ఇదే చెబుతున్నారు.1947 తర్వాత మొదటిసారిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారంపై సగటు గృహఖర్చులు సగానికి పైగా తగ్గాయని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి (EAC-PM) చేసిన వర్కింగ్ పేపర్ వెల్లడించింది.
ఆధునిక భారతదేశంలో ఇదే మొదటిసారి ఆహారంపై సగటు గృహ ఖర్చు..మొత్తం నెలవారీ వ్యయంలో సగం కంటే తక్కువగా ఉంది.ఇది గణనీయమైన పురోగతికి గుర్తుగా ఉంది అని పేపర్ వెల్లడించింది.
అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో గ్రామీణ,పట్టణ భారతదేశంలోని కుటుంబాల సగటు నెలవారీ తలసరి వ్యయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినప్పటికీ..పెరుగుదల లో మార్పు రాష్ట్రాలు , ప్రాంతాలను బట్టి మారుతుందని పేపర్ తెలిపింది.
ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ 2011--నుంచి2012మధ్య , 2022నుంచి -23 మధ్య 151శాతం వినియోగ వ్యయం వృద్ధిని నివేదించింది. అదే సమయంలో తమిళనాడు సుమారుగా 214శాతం వృద్ధిని సాధించింది. సిక్కింలో వినియోగ వ్యయం భారీగా 394శాతం పెరిగిందని పేపర్ తెలిపింది.