వానలకు కూలిన ఇండ్లు, చెట్లు

వానలకు కూలిన ఇండ్లు, చెట్లు

మూసాపేట/బషీర్ బాగ్/గండిపేట/చేవెళ్ల, వెలుగు: వర్షాలకు సిటీలోని పలు ప్రాంతాల్లో ఇండ్లు, చెట్లు కూలిపోయాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు చింతల్ డివిజన్ పరిధి భగత్ సింగ్ నగర్ లో ఓ రేకుల ఇంటి పై కప్పు ఒక్కసారిగా కూలింది. వారం రోజులుగా వర్షాలకు నానడంతో పై కప్పు కూలినట్లు స్థానికులు తెలిపారు.  

అత్తాపూర్ డివిజన్ పరిధిలో రెండు ఇండ్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చేవెళ్ల మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళ ఇంటి వెనుక వైపు గోడ వర్షానికి నాని కూలిపోయింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె వేడుకుంది. వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. 

ALSO READ :రాష్ట్రాన్ని మణిపూర్​లా మార్చే కుట్ర: మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​

మరికొన్ని చోట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గురువారం నాంపల్లి పరిధి పటేల్ నగర్ లోని సాయికృప అపార్ట్ మెంట్ లో కొబ్బరి చెట్టు కూలింది.  బీకే గూడ పార్కు ఏరియాలో పదేండ్ల నాటి చెట్టు కూలి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై పడింది.  బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టును అక్కడి నుంచి తొలగించారు.