జమ్మూ కాశ్మీర్‌‌‌‌, హిమాచల్‌‌‌‌లో భారీ అవలాంచ్

జమ్మూ కాశ్మీర్‌‌‌‌, హిమాచల్‌‌‌‌లో భారీ అవలాంచ్

శ్రీనగర్/ సిమ్లా: జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌,  హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తున్నది. రెండు రాష్ట్రాల్లో ఇండ్లు, రోడ్లు, చెట్లు మంచులో  కూరుకుపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

 జమ్మూకశ్మీర్‌‌‌‌ గందర్‌‌‌‌బల్ జిల్లాలోని ఫేమర్ టూరిస్ట్ ప్లేస్ సోనమార్గ్‌‌‌‌లో భారీ అవలాంచ్(మంచు జలపాతం)  సంభవించింది. మంగళవారం రాత్రి 10 గంటలకు ఓ టూరిస్ట్‌‌‌‌ రిసార్ట్‌‌‌‌పై మంచు ఉప్పెన విరుచుకుపడింది.ఇక హిమాచల్ లోని చంబా జిల్లాలోనూ మంచు కురుస్తున్నది. పంగి ప్రాంతంలోని మింధాల్​లో మంచు నది (స్నో రివర్)’ కనిపించింది. భారీ మంచు కారణంగా పర్వతాలపై పేరుకున్న మంచు కిందికి జలపాతంలాగా ప్రవహించింది.