అజిత్ పవార్ మృతి తీరని లోటు సంతాపం వ్యక్తం చేసిన : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అజిత్ పవార్ మృతి తీరని లోటు సంతాపం వ్యక్తం చేసిన : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అజిత్ పవార్ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని బుధవారం ఒక ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, రాజకీయాల్లో రాణిస్తూ.. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారని స్మరించుకున్నారు. మహారాష్ట్రకు సుదీర్ఘకాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారని తెలిపారు. ఆయన అకాల మరణం మహారాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, ఎన్డీయే కూటమికి తీరని లోటని చెప్పారు.