హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్

హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్
  • చందానగర్, కుర్మల్ గూడ, బహదూర్ పల్లి, తొర్రూరులో  వచ్చే నెల వేలం పాట

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్లాట్ల వేలానికి హౌసింగ్  బోర్డు ACటిఫికేషన్  రిలీజ్  చేసింది. కుర్మల్ గూడ, బహదూర్ పల్లి, తొర్రూరులో 189 ప్లాట్లకు వచ్చే నెలలో బోర్డు వేలం వేయనుంది. చందానగర్ లో మరో 3 కమర్షియల్  ప్లాట్లకు కూడా వచ్చే నెలలో వేలానికి టెండర్లు పిలిచింది. కుర్మల్ గూడలో 4న, బహదూర్ పల్లిలో 5న, తొర్రూరులో 6న, చందానగర్ లో 20న వేలం వేయనున్నామని నోటిఫికేషన్ లో హౌజింగ్  బోర్డు ఎండీ వీపీ గౌతమ్  తెలిపారు. 

చందానగర్  ప్లాట్ల వేలానికి ఒక్కో ప్లాట్ కు రూ.10 లక్షల డిపాజిట్  కట్టి రిజిస్ర్టేషన్  చేసుకోవాలని తెలిపింది. ఈ ప్లాట్లకు గజం రూ.40 వేలుగా ఖరారు చేశారు.  కుర్మల్ గూడ లో గజం రూ.20 వేలు, తొర్రూరులో గజం రూ.25 వేలుగా ఫిక్స్  చేశారు. బహదూర్ పల్లికి రూ.3 లక్షలు కట్టాలని, ఈ ప్లాట్లకు గజం రూ.27 వేలుగా నిర్ణయించామని ఎండీ తెలిపారు.