
పాల్వంచ, వెలుగు : పాల్వంచ ఆరోగ్య మాత చర్చి ఆధ్వర్యంలో శనివారం రాత్రి మేరీమాత ఊరేగింపు నిర్వహించారు. క్రైస్తవులు పల్లకిపై మేరీమాతను ఊరేగిస్తూ యేసుక్రీస్తు నినాదాలు చేస్తూ స్థానిక ఆరోగ్య మాత చర్చి నుంచి కొవ్వొత్తులతో లక్ష్మీదేవిపల్లి వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సెప్టెంబర్ 8 వరకు మేరీమాతకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.