
దేశ వ్యాప్తంగా వినాయకుడికి అత్యంత వైభవంగా పూజలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు వైభవంగా పూజలు చేసిన తరువాత ఈ ఏడాది సెప్టెంబర్ 6 వ తేదీని వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వెనుక భక్తి మాత్రమే కాదని శాస్త్రీయ కోణం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . . !
వినాయక నిమజ్జన కార్యక్రమానికి భక్తులు తయారవుతున్నారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. వినాయకచవితి పండుగ వర్షాకాలంలో వస్తుంది. అధికంగా వర్షాలు పడటంతో .. చెరువులు.. నదులు.. కొలనులు బురదతో పేరుకు పోయి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని తీయడంవల్ల పూడిక తీసినట్లు అవుతుంది..అప్పుడు నీళ్లు తేట పడతాయి..
వినాయకుడి బొమ్మలను మట్టితో చేయడం వలన అందులోని ఉన్న ఔషధగుణాలు పూజలు చేసిన వారికి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి చేయబడతాయి.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి నీటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక కూడా మరో కారణం ఉంది.మట్టితో చేసిన విగ్రహాలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుందని, తొమ్మిది రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని, అందుకోసమే తొమ్మిదవ రోజు ఈ విధమైనటువంటి వినాయకుడి ప్రతిమలను నిమజ్జన చేస్తారు.
ప్రస్తుత కాలంలోఎన్నో రసాయనాలను ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను తయారు చేయటం వల్ల వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీరు పెద్ద మొత్తంలో కలుషితమై ఎన్నో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది.