ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తాం : సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష

ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తాం : సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష

మునగాల, వెలుగు :  ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరిస్తామని సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష తెలిపారు. శనివారం మునగాలలోని ఎంపీడీవో ఆఫీసులో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం మార్పిడి, ఓటరు జాబితాలో వివిధ చోట్ల ఉన్న ఓటర్లను ఒకే వార్డులో చేర్చాలని పలువురు నాయకులు ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. 

ఆయా గ్రామాల పరిధిలో చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని, ఒకే కుటుంబానికి చెందినవారు వేర్వేరు వార్డుల్లో ఉండడం సరికాదని సూచించారు. అనంతరం జడ్పీ సీఈవో మాట్లాడుతూ పార్టీల నాయకుల సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకొని ఓటర్​జాబితాను సవరిస్తామని తెలిపారు.