చెప్పుకోవడానికే పదవి..సేవే శాశ్వతం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చెప్పుకోవడానికే పదవి..సేవే శాశ్వతం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : 'చెప్పుకోవడానికే ఎమ్మెల్యే పదవి.. కానీ సేవ చేయ డమే శాశ్వతం' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తెలిపారు. శనివారం చౌటుప్పల్​లో ఏర్పాటు చేసిన హెల్త్​ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రతిఒక్కరూ సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. తాను కూడా ఎమ్మెల్యే కాకుండా ఒక వ్యక్తిగా సాయం చేస్తానని చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తాను అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను అసెంబ్లీకి వెళ్లకుంటే రాజగోపాల్ రెడ్డి రాకపోవడానికి రకరకాల కారణాలను చూపిస్తూ పుకార్లు పుట్టిస్తారని నవ్వుతూ ఆయన కామెంట్ చేశారు.