- బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు
హైదరాబాద్, వెలుగు: హుజూర్‌నగర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలపై అక్కడి ప్రజలకు నమ్మకముందా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ప్రశ్నించారు. ఈ ఆరేళ్ల పాలనలో పంచాయతీలకు ఏనాడూ పైసా ఇవ్వని కేసీఆర్, ఇప్పుడు పంచాయతీకి రూ. 20 లక్షలు ఇస్తానంటే ఎలా నమ్ముతారని ఆయన అడిగారు. ఆరేళ్లలో హుజూర్‌నగర్ అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడినా సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు ఆపబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ బలపడుతుందని, 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపని జోస్యం చెప్పారు.

