ఉరకలేని సీఎం, మంత్రులకు ఎస్ఐ అభ్యర్థుల గోస ఎట్లా తెలుస్తది?

ఉరకలేని సీఎం, మంత్రులకు ఎస్ఐ అభ్యర్థుల గోస ఎట్లా తెలుస్తది?
  •     ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు
  •     రింగ్​రోడ్డు, మాస్టర్​ ప్లాన్లన్నీ స్కాంలే
  •     బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​

కాగ జ్ నగర్, వెలుగు:  ప్రభుత్వ తీరుతో పోలీసు అభ్యర్థులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​ నియోజకవర్గంలోని కౌటాల, సిర్పూర్​(టి) మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రాజ్​కుమార్​ అనే యువకుడు సూసైడ్​ చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. కేసీఆర్​ మెడలు వంచి న్యాయం జరిగేలా పోరాడుదామని, అంతే తప్పా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరకలేరని, నడవలేరని వాళ్లకు అభ్యర్థుల గోస ఎలా తెలుస్తుందన్నారు. రీజినల్ ​రింగు రోడ్డు మాస్టర్​ ప్లాన్​లన్నీ స్కాంలేనని, ఎమ్మెల్యే, మంత్రుల భూములకు రేట్లు రావడం కోసమే అలైన్​మెంట్​ మారుస్తున్నారన్నారు.  

ప్రజల సమస్యలు పట్టని ప్రగతిభవన్​ సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్​లో అడుగు పెట్టలేదని, అట్లాంటప్పుడు ఎందుకు రూ.1200 కోట్లు ఖర్చు చేసి కొత్త సెక్రటేరియేట్​కడుతున్నారని  ప్రశ్నించారు. దానికి ఏడాది పొడవున 300 మంది పోలీసులతో కాపలా ఎందుకన్నారు. సీఎంకు బహుజనులంటే గిట్టదని, అందుకే తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు రీ డిజైన్​పేరుతో కాళేశ్వరానికి తరలించుకుపోయాడన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీ భయంతో మీటింగ్​లు పెట్టుకొని కార్యకర్తలను మచ్చిక చేసుకుంటున్నారన్నారు. తర్వాత 317 జీఓ బాధితులకు సంఘీభావం తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, నియోజకవర్గ కన్వీనర్​ హర్షద్​ హుస్సేన్, అసెంబ్లీ అధ్యక్షుడు రాంప్రసాద్, సెక్రెటరీ ప్రవీణ్​ 
పాల్గొన్నారు.  .