షుగర్ పేషంట్లు రోజుకు ఎన్ని అరటి పండ్లు తినాలి

షుగర్ పేషంట్లు రోజుకు ఎన్ని అరటి పండ్లు తినాలి

షుగర్, బీపి వంటి వ్యాధులు ఒకసారి వస్తే ఇక జీవితాంతం పోవు.. ఎంతవరకు వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి.. లేకుంటే మాత్రం ఇక ప్రాణాలకు మాత్రం ముప్పే.. షుగర్ అధికంగా ఉండే కాయలు, పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు.. అలాంటి పండ్లలో ఒకటి అరటిపండు.. ఈ పండ్లలో షుగర్ అధికంగా ఉంటుంది.. అయితే షుగర్ పేషంట్స్  అరటి పండును తినవచ్చా... ఒకవేళ తింటే ఎలాంటి పండు తినాలి.. ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకు ఎన్ని పండ్లు తినాలంటే....

మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా అరటిపండ్లను తీసుకోకుండా ఉండాలని సూచిస్తారు. అరటిపండ్లు వాటికి హాని కలిగిస్తాయనే అపోహ కారణంగా ఇది ఉంది. నమ్ముతున్న దానిలా కాకుండా, అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గుండెను మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. కాని మధుమేహం ఉన్నవారు రోజుకు 1-2 అరటి పండ్లను తినవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు,  అయితే  షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వారు వైద్యుల సూచనల మేరకు అరటిపండ్లను తినాలంటున్నారు.   అరటి పండు ఎముకలను ధృడంగా ఉంచుతుంది,  అంతే కాక అనేక విటమిన్లు అరటిపండులో ఉంటాయి.  ఇది స్ట్రోక్స్ లాంటి ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. 

ఎలాంటి పండు తినాలి...

మధుమేహం ఉన్నవారు అరటిపండును తినేటప్పుడు కొన్ని పద్దతులు పాటించాలి.  అరటి పండ్లను బాగా పండినవి కాకుండా కాస్త దోరగా ఉన్నవి తినాలి. ఇలాంటి అరటిపండు జీవక్రియను మెరుగుపరుస్తుంది.   బాగా పండినవి అయితే తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. ఆ పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమై త్వరగా చక్కెర రక్తంలో కలుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇవి చిన్న ప్రేగులో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పరుస్తాయి.  దీంతో పెద్ద ప్రేగులో పుల్లని పదార్దం ఏర్పడి గట్ అనే బ్యాక్టీరియాను వృద్ది చేస్తాయి.  కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను కాకుండా కాస్త దోరగా ఉన్న అరటి పండ్లను తింటే మంచిది. వీటిల్లో ఒక మీడియం సైజ్ అరటి పండు అయితే సుమారుగా 14 గ్రాముల మేర కార్బొహైడ్రేట్లు ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు..

ఎప్పుడు తినాలి..

ఇక షుగర్ ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినరాదు. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌, లంచ్ లేదా డిన్నర్ మధ్యలో తినాలి. దీంతో అరటి పండ్లలో ఉండే చక్కెరలను శరీరం నెమ్మదిగాతీసుకోవాలి.. ఇక అరటి పండ్లను తింటే కొందరిలో షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అరటి పండ్లను తిన్న అనంతరం గంటన్నర సమయం పాటు ఆగి షుగర్ చెక్ చేయాలి. ఎక్కువగా ఉంటే అలాంటి వారు ఈ పండ్లను తినరాదు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే ఈ పండ్లను తినవచ్చు. ఇలా షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటి పండ్లను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల షుగర్ పెరగదని నిపుణులు చెబుతున్నారు.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే  షుగర్ కంట్రోల్ లో ఉండే విధంగా డైట్ పాటించాలి.   దోరగా ఉన్న వాటినే తీసుకోవాలి.. మర్చిపోకండి. .