Beauty Tips : తలస్నానం రోజూ చేయాలా.. వారానికి 3 రోజులు చేస్తే చాలా..!

Beauty Tips : తలస్నానం రోజూ చేయాలా.. వారానికి 3 రోజులు చేస్తే చాలా..!

ఈ మధ్యకాలంలో అందరూ జుట్టు, చర్మానికి సంబంధించి ఏదో ఒక సమస్యతో పడుతున్నారు? ఆ సమస్యల నుంచి ఎలా బయట పడాలో... ఎలాంటి తీసుకోవాలో తెలియట్లేదా? వాటిలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఇలా ఉన్నాయి. 

రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలదు. రెగ్యులర్ తలస్నానం చేయకపోతేనే తలలో చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తాయి. చాలామంది రెగ్యులర్ గా తల స్నానం చేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లు కచ్చితంగా తమ అలవాటును మార్చుకోవాలి. తల స్నానం వల్లే తలలో చెమట, దుమ్మూధూళి తొలగిపోయి... మాడు శుభ్రంగా ఉంటుంది. 

ఇలా చేయాలి

* తల స్నానానికి మైల్డ్ షాంపూ రసాయనాల గాఢత తక్కువగా ఉండేవి ఉపయోగించాలి.
* నూనె పెట్టుకున్నప్పుడు కచ్చితంగా షాంపూతోనే తలను శుభ్రం చేయాలి..
* తలస్నానం చేసిన ప్రతిసారి కండీషనర్ తప్పనిసరి. 
* జుట్టును ఆరబెట్టుకోవడానికి టవల్ని వాడాలి. ఒకవేళ డ్రయ్యర్ వాడాలనుకుంటే తక్కువ వేడితో వాడాలి. అలాగే దాంతో 25 సె.మీ.ల దూరం నుంచే డ్రై చేసుకోవాలి. 
* జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉండాలంటే నాణ్యమైన సీరమ్ వాడాలి.
పైన చెప్పిన చిట్కాలన్నీ పాటిస్తూ.. రోజూ లేదా రోజు విడిచి రోజు తల స్నానం చేస్తే జుట్టు, మాడు శుభ్రంగా, ఉంటాయి.

సాధారణంగా టీనేజ్ పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా వయసు వాళ్లలో కూడా మొటిమల సమస్య ఉంటుంది. దీన్నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. 

* మొటిమలతో ఇబ్బందిపడే వాళ్లు రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువగా ముఖాన్ని శుభ్రం చేసుకోవద్దు.
కడుక్కునేటప్పుడు కూడా మొటిమల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సబ్బులనే వాడాలి.
* ముఖాన్ని ఇష్టానుసారం రుద్దొద్దు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మొదలై ముఖంపై చర్మం ఎర్రబడటం, వాపు లాంటివి
జరుగుతాయి.
* చాలామంది మొటిమలను గిల్లుతుంటారు. అలా చేయకూడదు. చేస్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతుంది. 
* అతి తక్కువ సమయంలో మొటిమలను తొలగించాల్సి వచ్చినప్పుడే... నిపుణుల చికిత్స అవసరం.
* వీలైనంత వరకు ముఖాన్ని చేతులతో తాకొద్దు. 
* ఫోన్ మాట్లాడేటప్పుడు.. దాన్ని ముఖానికి తగలకుండా దూరంగా పట్టుకోవాలి.
* ముఖానికి లోషన్స్, క్రీమ్స్, మేకప్ అప్లై చేసుకునేటప్పుడు చేతులను హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి.
* కళ్లద్దాలు వాడేవాళ్లు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాటికి సీబమ్, చర్మ మృతకణాలు అతుక్కుంటాయి.
* చాలామందికి మొటిమలు.. వీపు, భుజాలు, ఛాతీ భాగాల్లో అవుతుంటాయి. అలాంటి వాళ్లు వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. రెగ్యులర్ గా వాడే ఆభరణాలు, హెడ్బ్యాండ్స్, టోపీలు, స్కార్ఫ్ మొదలైన వాటిని కూడా చర్యానికి బిగుతుగా వేసుకోవద్దు. వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. అయిలే బెస్ట్ మేకప్ ప్రొడక్టులు వాడొద్దు. పడుకునే ముందు మేకప్ ను కచ్చితంగా తీసేయాలి.
౦ షేవింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ సేవర్ లేదా నాణ్యమైన బ్లేడ్లను ఉపయోగించాలి. షేవింగ్ క్రీమ్ రాసుకునే ముందు గడ్డం, చర్మాన్ని గోరువెచ్చని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
* జుట్టును జిడ్డుగా మార్చే హెయిర్ ప్రొడక్ట్స్ (కొకోవా బటర్ మొదలైన పదార్థాలు కలిగిన) ఉపయోగించొద్దు. 
• వీలైనంత వరకు ఎండకు తిరగకపోవడమే. మేలు. ఎండకు వెళ్లడం వల్ల చర్మం ఎక్కువ సీఐమ్ ను స్రవిస్తుంది. అలాగే మొటిమలకు సంబంధించిన మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా సన్బర్న్ సమస్యలు వస్తాయి.
ఈ ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువైనా... కార్టిసోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలై మొటిమలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
* చర్మం పై చెమట పట్టకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎప్పుడూ చల్లటి ప్రదేశాల్లో ఫ్యాన్, ఏసీ కింద ఉండటం మంచిది.