వ్యవసాయం అంటే ఎంత ప్రేమ సార్ మీకు..రైతుగా మారిన మెదక్ కలెక్టర్

వ్యవసాయం అంటే ఎంత ప్రేమ సార్ మీకు..రైతుగా మారిన మెదక్ కలెక్టర్

ఓ జిల్లాకు పరిపాలనా అధికారి..బిజీబిజీ షెడ్యూల్.. మట్టి తాకని ఉద్యోగం చేస్తున్నా.. నేలతల్లిపై మమకారం పోలేదు...వ్యవసాయం అంటే సార్ కు ప్రాణం.. బిజీ లైఫ్ లో కొంచెం విరామ సమయం దొరికినా..ఆ సమయాన్ని మట్టి వాసనతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు.. కుటుంబం మొత్తం సార్ ను అనుకరించారు.. బురద పొలంలో నాట్లు వేస్తూ మేడం, ఆయన కూతుళ్లు.. నారు పంచుతూ కరిగట్టు పొలాన్ని పరిశీలిస్తున్నాడు రాహుల్ సార్.. ఆ సీన్ చూసేవాళ్లకు చూడముచ్చటగా అనిపించింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఫ్యామిలీ మొత్తం బురద పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.. 

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ సార్.. ఆయన సతీమణి, పిల్లలు అంతా వీకెండ్ ను వ్యవసాయ పొలంలో స్పెండ్ చేశారు. మెదక్ జిల్లా ఔరంగాబాద్ లో  కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ను ఆనుకొని గొల్ల నారాయణ అనే రైతు పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేశారు రాహుల్ రాజ్ సార్ ఫ్యామిలీ.. మేడ్ , వారి పిల్లలు నాట్లు వేస్తుంటే.. రాహుల్ రాజ్ సర్.. నారు పంచుతూ పొలం అంతా కలియ తిరుగుతూ పరిశీలించారు. ఈ వీడియో చూసిన వారంతా రాహుల్ సార్ వ్యవసాయంపట్ల పెంచుకున్న మమకారంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.