ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? చట్టాలు ఏం చెబుతున్నాయి..? 

ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? చట్టాలు ఏం చెబుతున్నాయి..? 

Cash Limit at Home : ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? ఒకవేళ లెక్కకు మించి ఉంటే ఏంటి పరిస్థితి..? ఎక్కువగా ఉన్న డబ్బుకు లెక్కలు లేకపోతే...? ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంటే ఐటీ అధికారులు సీజ్ చేస్తారా..? అసలు ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు? ఎక్కువగా డబ్బులు నిల్వ చేసుకుంటే ఏదైనా సమస్య వస్తుందా..? ఐటీ శాఖ ఒకవేళ మీ ఇంట్లో రైడ్స్ చేస్తే అప్పుడు ఎక్కువ డబ్బులు ఉంటే ఎలా? ఇలాంటి ప్రశ్నలు మీకెప్పుడైనా వచ్చాయా..? 

ఇండియాలో జనం సాధారణంగా డబ్బులు ఇళ్లలోనే ఉంచుకోవడం కామన్. పాతకాలం నుంచే ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇంకొందరు బ్యాంకుల్లో దాచుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్లు పెడుతుంటారు. ఈ మధ్య బ్యాంకులు కూడా దివాలా తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకొని.. ఇంట్లో ఎంత వరకు ఉంచుకోవచ్చు అనే ప్రశ్నలు చాలామందికి తలెత్తుతున్నాయి. 

ఇళ్లల్లో ఎంత నగదు అయినా నిల్వ చేసుకోవచ్చు. ఇంత వరకే ఉండాలనే కచ్చితమైన నిబంధన లేదు. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇంత డబ్బు ఉండాలని చెప్పదు. అయితే.. ఇంట్లో ఉన్న డబ్బులకు లెక్కలు ఉండాలి. ఎంత డబ్బు ఉంది..? అది ఎక్కడి నుంచి వచ్చింది...? అన్నది మీరు ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బుకు సంబంధించిన పత్రాలు లేదా డాక్యుమెంట్లు అవసరం. అప్పుడే మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. 

ఇక బిజినెస్‌లో వస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. ప్రతి పైసాకు ఐటీశాఖ అధికారులు లెక్కలు అడుగుతారు. ట్యాక్స్ కడుతున్నారా..? లేదా అనేది చూస్తారు. లేకుంటే పన్ను ఎగవేత కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీ డబ్బుకు సరైన లెక్క లేకుంటే.. దానిని సీజ్ చేసే అధికారం ఐటీ శాఖకు ఉంటుంది. 

ఐటీశాఖ అధికారుల నుంచి సాధారణంగా మీ దగ్గర మొత్తం ఎంత నగదు ఉంది..? మీ ఆదాయం ఎంత..? ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక ఇంట్లో ఉన్న డబ్బు పన్ను పరిధిలోకి వస్తే.. దానికి ఎవరైనా సరే టాక్స్ చెల్లించాల్సిందే. ఇక లెక్కకు మించిన డబ్బులు ఉంటే.. డబ్బు సీజ్ చేయడంతో పాటు దానిపై అదనంగా 37 శాతం వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత తక్కువగా డబ్బును ఇంట్లో దాచుకోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.