జుమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ రోజుకు ఎంత సంపాదిస్తారు..?

జుమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ రోజుకు ఎంత సంపాదిస్తారు..?

జుమాటో, స్విగ్గీ.. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ తెలియని వాళ్లు ఉండరు.. అలా ఆర్డర్ చేయగానే బాయ్ వచ్చి ఇలా ఇచ్చేస్తారు.. రోజూ లక్షల మంది దేశ వ్యాప్తంగా ఆయా ఫుడ్ యాప్స్ కు డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు.. ఇప్పుడు దేశంలో చాలా మందికి ఓ సందేహం వచ్చిందంట.. అదేంటో తెలుసా.. జుమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ రోజూ ఎంత సంపాదిస్తారు అని.. ఇంటర్నెట్ లో మోస్ట్ సెర్చింగ్ క్వశ్చన్ ఇది రావటంతో.. జనంలో ఎంత డౌట్ ఉందో అర్థం అవుతుంది. దీనికి సంబంధించి ఓ స్టోరీ సైతం వైరల్ అవుతుంది.. అదేంటో చూద్దాం...

 

ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కటీ కేవలం ఒకే ఒక్క క్లిక్‌లో మీ ముందు ఉంటుంది. మనం అంతకుముందు మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకునే చాలా వస్తువులు.. ప్రస్తుతం మనకి ఇంట్లో కూర్చుంటేనే దొరుకుతున్నాయి. వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సినవసరం ఉండటం లేదు. దీనిలో ఒకటే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు ఈ సౌకర్యాన్ని అందజేస్తున్నాయి.  అయితే ఆహారాన్ని డెలివరీ బాయస్ బ్యాగ్.. బండి.. హంగామా చూస్తే వీరు రోజుకు ఎంత సంపాదిస్తారా.. ఆన్ లైన్ ఆర్డర్లపై వారికెంత ఆదాయం వస్తుందా అని ఇంటర్ నెట్ తెగ సెర్చ్ చేస్తున్నారు.  అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా సైట్ లో జొమాటో డెలివరీ బాయ్  భాను ప్రతాప్ తాను ఎంత సంసాదిస్తున్నాడో స్వయంగా వెల్లడించాడు.  అతను తన ఇన్ స్టా ఖాతాలో తన సంపాదనను తెలిపాడు.  


 తన సంపాదన వివరాలను ఆన్‌లైన్‌లో వ్యక్తులతో  షేర్ చేపుకున్నాడు. ప్రతి ఆర్డర్ కు కొంత కమిషన్ వస్తుందని... ఎంత మేరకు వస్తుందో ముందే తెలియజేస్తారన్నారు. ఆర్డర్లు బాగా వస్తే రోజుకు రూ.300 వస్తాయరి.. కాని ఆర్డర్లు అడపా దడపా వస్తే రోజుకు రూ. 200 మాత్రమే వస్తాయని భాను ప్రతాప్ తెలిపాడు.  ఇక వారు ఎప్పుడూ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తూ ఉండాలని.. తమ జీవితంలో పార్టీలు కాని... ఎంజాయిమెంట్ గాని ఏమీ ఉండవని తెలిపాడు.  భాను ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే ఈ డెలివరీ బాయ్ కోటాలో ఫుడ్ డెలివరీ చేస్తాడు.