
పవన్ కల్యాణ్.. జనసేన అధినేత.. పవర్ స్టార్.. సినిమా హీరోగానే కాదు.. రాజకీయంగానూ తన సత్తా చాటుతున్నారు. పవన్ కల్యాణ్ లో మరో కోణం అది. అదే ఆధ్యాత్మికం.. దేవుడిపై నమ్మకం.. పూజలు, హోమాలు. ఇవన్నీ తరచుగా చేస్తూనే ఉంటారు. పవన్ కల్యాణ్ చేతికి ఇప్పుడు కొత్తగా రెండు ఉంగరాలు కనిపిస్తున్నాయి. ఈ ఉంగరాల విషయమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో.. సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలు బాగా హైలెట్ అయ్యాయి.
ఇంతకీ పవన్ కల్యాణ్ ధరించిన రెండు ఉంగరాలు ఏంటీ అంటారా.. ఒకటి నాగ బంధం, మరొకటి కూర్మావతారం.. ఈ రెండు బంగారు ఉంగరాలు.. చాలా పెద్ద సైజులో.. కుడి చేతి వేళ్లకు ధరించి ఉండటంతో.. ఆ ఉంగరాలు ధరిస్తే వచ్చే లాభం ఏంటీ.. ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేది చర్చనీయాంశం అయ్యింది. నాగ బంధం, కూర్మావతారం ఉంగరాల విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. వాటిని ధరిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం...
నాగ బంధం ఉంగరం ప్రయోజనాలు ఇలా ఉంటాయి
నాగపాము ఆకారంలో ఉండే నాగ బంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా రాహు కేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు పండితులు. ఎవరంటే వాళ్లు నాగ బంధం ఉంగరాలు ధరించకూడదని.. జ్యోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని పండితులు స్పష్టం చేస్తున్నారు.
కూర్మావతారం ఉంగరం ప్రయోజనాలు ఇలా ఉంటాయి
కూర్మావతారం (తాబేలు) ఉంగరం ధరించటం వల్ల అధికార, ధన యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించే వారు.. ఇలాంటి కూర్మావతారం.. (తాబేలు) ఉంగరాలు ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ రెండు ఉంగరాలు.. అది కూడా పెద్ద సైజులో ధరించటం చూస్తుంటే.. ఆయన అధికార యోగం కోరుకుంటున్నారనే అనుకోవచ్చు అంటున్నారు పండితులు. చూడాలి భవిష్యత్ ఈ ఉంగరాలు.. పవన్ కల్యాణ్ కు అధికారం యోగం తీసుకొస్తాయో లేదో...