
బిగ్బాస్ కంటెస్టెంట్ రతిక( Rathika) సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) మాజీ ప్రియురాలు అని వార్తలు వస్తున్న వేళ..రాహుల్ పోస్ట్ వైరలవుతోంది. తన పేరును వాడుకుని పైకి రావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ రాహుల్ ఇన్ స్టా వేదికగా స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశాడు.
‘నాకో అనుమానం.. ఆరేళ్ల తర్వాత సడెన్‌గా వారి పర్సనల్ ఫోన్లో ఉన్న ఫొటోలు ఎలా లీకయ్యాయి? లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానం మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడున్నది అమ్మాయైనా..అబ్బాయైనా నాకు వారితో ఎలాంటి సంబంధం లేదు.
ఫేక్ సింపతీ గేమ్స్ ఇక ఎప్పటి వరకు? ఒరిజనల్ టాలెంట్‌ను బయటపెట్టాలని కొందరు చూస్తారు. కానీ కొంత మంది మాత్రం ఎప్పుడూ పక్క వారి పేరు, టాలెంట్ మీద బతకాలని చూస్తుంటారు..ఫేమ్ కోసం పేరుని, అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు..అందరికీ పాస్ట్‌లైఫ్ ఉంటుంది. ఇలాంటి పనులు చేసేముందు ఎదుటి వ్యక్తి కుటుంబం గురించి ఆలోచించాలి. అర్థం చేసుకుంటే మంచిది. నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలనుకుంటే ఇక మీ ఇష్టం..కానీ ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవు. లోపల ఉన్న పర్సన్‌కి ఆల్ ది బెస్ట్..పైసల్ తీసుకుని పని చేస్తున్న ఆమె టీంకు కంగ్రాట్స్ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం బిగ్బాస్ చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. రతిక ఈ బిహ బాస్ సీజన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను, యావర్ ను వాడుకుంటుందని న్యూస్ బాగా వినిపిస్తోంది. ఈ ఇద్దరినీ తన మైండ్ గేమ్ తో ఎలాగైనా వెనక్కి లాగాలని ట్రై చేస్తోంది.
అంతేకాకుండా టాస్కులో యావర్‌ను నానా రకాలు చిత్రహింసలు పెట్టింది. వెనకాల ఐస్ గడ్డలు కూడా వేసింది.దీంతో రతిక బిహేవియర్ జనాలకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు. అందుకే రతిక బ్రేకప్ కథలు వింటున్నా కూడా రాహుల్ మంచి పని చేశాడు.. ఈమెను వదిలేసి మంచి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.