గుడ్ న్యూస్ : తక్కువ సిబిల్​ స్కోర్​తోనూ లోన్

గుడ్ న్యూస్ : తక్కువ సిబిల్​ స్కోర్​తోనూ లోన్
  • కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి​

న్యూఢిల్లీ: తక్కువ సిబిల్​ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లోన్​ను పొందడం కష్టమే కానీ అది అసాధ్యమైతే కాదు.  ఇలాంటి వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లోన్​ వస్తుంది. ఉదాహరణకు, మీరు ప్రారంభంలో చిన్న లోన్​ను ఎంచుకోవాలి.  చిన్న మొత్తమే కాబట్టి అప్రూవల్​కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయంతో ఈఎంఐలను కట్టగలిగితే లోన్​ సాధ్యమవుతుంది. తక్కువ లోన్​ కోసం తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి లోన్​ ఇవ్వడానికి బ్యాంకులు మరింత సుముఖంగా ఉంటాయి.  మీ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ అన్ని బిల్లులను సకాలంలో చెల్లించాలి.  క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తగ్గించుకోవాలి.  అనవసరంగా కొత్త లోన్​ కోసం దరఖాస్తు చేయకూడదు.

అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలు:

పర్సనల్​ లోన్ ​వంటి అన్​సెక్యూర్డ్​ లోన్​కు బదులు ఇల్లు, కారు లేదా సేవింగ్స్​ వంటి లోన్​కు అప్లై చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాంకులు సెక్యూర్డ్​ లోన్​ను ఆమోదించడానికి మరింత సుముఖంగా ఉండవచ్చు. ఎందుకంటే మీరు డిఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అయితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అయితే, సెక్యూర్డ్ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టకుంటే మీ కొలేటరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. రెండో వ్యూహం ఏమిటంటే...మీకు మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు ఉంటే, మీరు లోన్​పత్రాలపై కో–సైన్​ చేయాలని అడగవచ్చు. వారి మంచి క్రెడిట్ స్కోర్ మీకు సహాయపడవచ్చు. దీనివల్ల లోన్​ అప్రూవల్​అవకాశాలు పెరుగుతాయి. మీరు డిఫాల్ట్ అయితే, కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సైన్​ చేసిన వ్యక్తి కూడా బాధ్యత వహిస్తారని గుర్తుంచుకోండి.

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లెండర్లు

సాధారణ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ లోన్​ దరఖాస్తును ఆమోదించడానికి ఇష్టపడకపోతే, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లెండర్లు లేదా పీర్-టు-పీర్ లెండింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వంటి వాటిలో అడగవచ్చు. వీటిలో రూల్స్ ​సరళంగా ఉండవచ్చు.  ఆదాయం, ఉపాధి వంటి అదనపు డాక్యుమెంట్లు ఇస్తే లోన్​ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ అదనపు డాక్యుమెంట్లు మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి చెల్లించగల మీ సామర్థ్యంపై బ్యాంకులకు మరింత నమ్మకాన్ని ఇస్తాయి. ఇలాంటి వాటిలో వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి  ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంగీకరించే ముందు అన్నీ చూసుకోవడం అత్యవసరం. మరో సంగతి ఏంటంటే..కనీసం సంవత్సరానికి ఒకసారి క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్ చేయాలి.