ఈ లక్షణాలుంటే బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువే

ఈ లక్షణాలుంటే బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువే

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ గా పిలుస్తున్న ముక్రోమైకోసిస్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించేందుకు ఎయిమ్స్ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. హై షుగర్ తో బాధపడుతున్న వారితో పాటు ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని ఎయిమ్స్ తెలిపింది. 

ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలె
- ముక్కు నుంచి రక్తం కారడం
- ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు ఎర్రబడటం, చూపు కోల్పోవడం
- ఒళ్లు జలదరించినట్లు అనిపించడం.. నమలడంలో, నోరు తెరవడంలో ఇబ్బందులు రావడం లాంటి లక్షణాలు కనపడితే వెంటనే ఈఎన్ టీ డాక్టర్ ను సంప్రదించాలి. రెగ్యులర్ గా చెకప్ చేయించాలి. సొంతగా ఎలాంటి మెడిసిన్స్, స్టెరాయిడ్స్ వాడకూడదని ఎయిమ్స్ సూచించింది.

ఈ రోగులకు బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువ
- షుగర్ లెవెల్స్ అధికంగా ఉండి, అదుపు చేయడం కష్టమైన పేషంట్ లకు ముక్రోమైకోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువని ఎయిమ్స్ తెలిపింది. 

- యాంటీ క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారు, క్రోనిక్ డెబిలిటేటింగ్ ఇల్ నెస్ తో బాధపడే రోగులకు బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- అధికంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ముఖ్యంగా tocilizumab లాంటివి నియోగిస్తున్న రోగులకు బ్లాక్ ఫంగస్ తో రిస్క్. 

- కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ మీద ఉన్న వారికీ ముక్రోమైకోసిస్ ముప్పు ఎక్కువని ఎయిమ్స్ పేర్కొంది.