బీఆర్​ఎస్​లో ఎలా చేరాలి? : కవితకు అభిమాని ట్వీట్

బీఆర్​ఎస్​లో ఎలా చేరాలి?  : కవితకు అభిమాని ట్వీట్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ మహారాష్ట్రకు చెందిన సాగర్ ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్​ద్వారా వివరాలు అడిగారు.  అభిమాని చేసిన ట్వీట్ కు​ ఆమె స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కి మద్దతివ్వాలని సూచించారు. తెలంగాణ మాదిరిగా దేశంలో 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనం అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌లో నిర్వహించిన పబ్లిక్​మీటింగ్ మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు.