BHIM UPIకి క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలంటే..

BHIM UPIకి క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలంటే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.. UPI అనేది నేటి కాలంలో చెల్లింపులు చేయడానికి అత్యంత సాధారణ మార్గం. ప్రతి ఒక్కరూ నగదు రహితంగా మారుతున్నారు. చెల్లింపులు చేయడానికి, స్వీకరించడానికి ఈ రోజుల్లో అనేక మంది స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి. UPI అనేది సమస్యను పరిష్కరించే, ఉపయోగించడానికి సులభమైన ప్లాట్‌ఫారమ్. ఇది యూజర్ ను నగదు రహితంగా మార్చడానికి, స్మార్ట్‌ఫోన్ సహాయంతో చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్‌తో లింక్ చేయబడుతుంది.

UPI చెల్లింపు ఎలా చేయాలంటే..

UPI ద్వారా లావాదేవీలు క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా QR కోడ్‌ని స్కాన్ చేయడం, సింగిల్-క్లిక్ తో నగదును ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

UPI యాప్‌తో కార్డ్‌ని లింక్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. కానీ చాలా మంది ఇప్పటికీ దీన్ని ప్రాసెస్ చేయడంలో కష్టపడుతున్నారు. భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM)తో ఇన్ హౌజ్ UPI యాప్‌ని లింక్ చేయొచ్చు.

BHIM ప్లాన్

రిలయన్స్ రిటైల్ స్టోర్ నుంచి జియోమార్ట్, ఇతర డిజిటల్ పోర్టల్స్ కోసం కొత్త డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

  •     మీ మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను నమోదు చేయడం ద్వారా మీరు మీ BHIM UPI ఖాతాను సెటప్ చేయొచ్చు.
  •     లావాదేవీలను ప్రొటెక్టెడ్ గా ఉంచడానికి 4-అంకెల పాస్‌కోడ్‌ను సెటప్ చేయండి.
  •     ఇప్పుడు BHIM UPI యాప్‌ను ప్రారంభించండి.
  •     అక్కడ, ఎగువ ఎడమ వైపున ఉన్న 'బ్యాంక్ ఖాతా' సింబల్ పై నొక్కండి.
  •     ఇప్పుడు దిగువ కుడి కార్నర్ లో ఉన్న + చిహ్నంపై క్లిక్ చేయండి.
  •     'క్రెడిట్ కార్డ్' ఆప్షన్ ను ఎంచుకోండి.
  •     మీరు ప్లాట్‌ఫారమ్‌కు జోడించాలనుకుంటున్న క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఖాతాను టైప్ చేయడం కొనసాగించండి.
  •     ఇప్పుడు మిగిలిన దశలను ఫాలో అవ్వండి.
  •     చివరగా.. వెరిఫికేషన్ కోసం లింక్ చేయబడిన నంబర్‌పై ఒక OTPని అందుకుంటారు.
  •     ఇది పూర్తయిన తర్వాత, మీరు BHIM UPI యాప్‌ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటారు.