కొబ్బరి​ హల్వా ​ రెసిపీ ఎలా చేయాలంటే..!

కొబ్బరి​ హల్వా ​ రెసిపీ ఎలా చేయాలంటే..!

రాఖీ అంటే నోరూరించే మిఠాయిలు కూడా. అందుకే ఈ హెల్దీ అండ్​ టేస్టీ కొబ్బరి​ హల్వా ​ రెసిపీ మీకోసం.  

కావాల్సినవి

కొబ్బరి నూనె– ఎనిమిది టీ స్పూన్లు
కొబ్బరి పాలు– వంద మిల్లీ లీటర్లు
ఎండు కొబ్బరి పొడి– వంద గ్రాములు
కుంకుమ పువ్వు– కొద్దిగా
బెల్లం లేదా చక్కెర పొడి​ – సరిపడా
యాలకుల పొడి– కొంచెం
బాదం, పిస్తా, జీడిపప్పు– అన్నీ కలిపి రెండు టీ స్పూన్​లు​

తయారీ

పాన్​ వేడిచేసి కొబ్బరినూనె వేయాలి, అందులో కొబ్బరి పొడి వేసి సన్నటి మంటమీద కలుపుతూ వేగించాలి. కొబ్బరి పొడి గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేగించాలి. ఆ తరువాత కొబ్బరి పాలు కలపాలి.  బెల్లం లేదా చక్కెర పొడి, కుంకుమ పువ్వు , యాలకుల పొడి కూడా వేసి కలుపుతూ మరో పదినిమిషాలు ఉడికించాలి.  కాస్త నూనె బయటికి తేలాక స్టప్​ ఆపి,  బాదం, పిస్తా, జీడిపప్పుతో గార్నిష్​ చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది.