వర్షాకాలంలో ఫ్యాషనబుల్‌గా కనిపించడం కొంచెం కష్టం. ఎందుకంటే.. ఎంతబాగా రెడీ అయినా, ఎంతమంచి డ్రెస్ వేసుకున్నా సరే.. వర్షానికి బయటికి వెళ్లేముందు రెయిన్ కోట్‌తో కవర్ చేసుకోవాల్సిందే. దానివల్ల వేసుకున్న డ్రెస్ లుక్ కనిపించదు. ఇలాంటప్పుడు ట్రాన్స్‌పరెంట్ రెయిన్ కోట్స్ వేసుకుంటే డ్రెస్ డిజైన్ కవర్ అయిందనే బాధ కూడా ఉండదు. వీటితో పాటు కొత్త లుక్‌తో వస్తున్న రెయిన్ కోట్స్ కూడా ట్రై చేయొచ్చు. పువ్వులు, బొమ్మలు, జాకెట్ టైప్‌లతో రకరకాల రంగుల్లో దొరుకుతున్నాయి. ఇవి వేసుకుంటే ట్రెండీ ఫ్యాషన్ లుక్ వచ్చేస్తుంది. స్టైలిష్‌గా కనిపిస్తారు.
