ఎస్​బీఐ నెట్​ బ్యాంకింగ్ యాక్టివేషన్ బ్రాంచ్​కు వెళ్లకుండానే..

ఎస్​బీఐ నెట్​ బ్యాంకింగ్ యాక్టివేషన్ బ్రాంచ్​కు వెళ్లకుండానే..

న్యూఢిల్లీ: ఈ రోజుల్లో  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లావాదేవీలు సర్వసాధారణంగా మారాయి.  ఎక్కడ చూసినా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ చెల్లింలు కనిపిస్తుంటాయి.  యూపీఐ, నెట్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్, క్రెడిట్​కార్డుల లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్​ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)  తన వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కస్టమర్‌‌‌‌‌‌‌‌లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో, ఎప్పుడైనా  ఎక్కడైనా వివిధ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. మీరు ఎస్​బీఐ కస్టమర్ అయితే  మీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ నెట్‌‌‌‌‌‌‌‌బ్యాంకింగ్ ఖాతాను బ్రాంచ్​కు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే చేయవచ్చు.  ఒకసారి రిజిస్టర్​ చేసుకున్న తర్వాత, ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మొబైల్‌‌‌‌‌‌‌‌లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ ​వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఆన్​లైన్​లో నెట్​బ్యాంకింగ్​ యాక్టివేషన్​ ఎలా చేయాలో తెలుసుకుందాం.

స్టెప్ 1:  ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్​ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో యాక్టివ్​ చేయడానికి మొదటి స్టెప్​ ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్  అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ -- https://retail.onlinesbi.sbi/retail/login.htm. కు వెళ్లాలి. 
స్టెప్​ 2: ఇప్పుడు అందులో "పర్సనల్​ బ్యాంకింగ్ విభాగం" ఓపెన్​ చేసి 'కంటిన్యూ లాగిన్​' ఆప్షన్​ను ఎంచుకోండి. ఈ బటన్‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఎస్​బీఐ  ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకానికి సంబంధించిన సేవా నిబంధనలను అంగీకరించినట్టుగా భావించాలి.

స్టెప్​ 3: ఈ దశలో“న్యూ కస్టమర్​ రిజిస్ట్రేషన్”పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లడానికి ఈ ఆప్షన్​పై క్లిక్ చేయండి.
స్టెప్​ 4:  రిజిస్ట్రేషన్ పేజీలో, మీ ఖాతా నంబర్, సీఐఎఫ్​ నంబర్, బ్రాంచ్ కోడ్,  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్  ఇతర వివరాలను ఇవ్వాలి. ఏవైనా సమస్యలు రాకుండా చూసుకోవడానికి అన్ని వివరాలను కచ్చితంగా ఇవ్వాలి.
స్టెప్​ 5:  వివరాలను ఎంటర్​ చేసిన తర్వాత, మీరు ఓటీపీ (వన్-టైమ్ పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్)ని క్రియేట్​ చేసుకోవాలనే మెసేజ్​ కనిపిస్తుంది. ఈ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌‌‌‌‌‌‌కు వస్తుంది. అక్కడ కనిపించే ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఓటీపీని ఎంటర్​ చేసి, “సబ్​మిట్​” బటన్​పై క్లిక్ చేయండి.
స్టెప్ 6:  వెబ్​సైట్​ ఇప్పుడు రెండు చాయిస్​లను చూపుతుంది. అవి... - ‘నా దగ్గర నా ఏటీఎం కార్డ్ ఉంది’  ‘నా ఏటీఎం కార్డ్ నా దగ్గర లేదు’. మొదటి ఎంపికను ఎంచుకుని, ఏటీఎం కార్డ్ వివరాలను నింపాలి. ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్.. ఏటీఎం కార్డ్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే, మీరు నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ శాఖకు వెళ్లాలి.
స్టెప్ 7: ఇప్పుడు ‘సబ్​మిట్​’ బటన్​పై క్లిక్ చేయండి.  వెంటనే టెంపరరీ యూజర్​ నేమ్​ స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై  కనిపిస్తుంది.
స్టెప్​ 8:  ఓటీపీని ఎంటర్​ చేసిన తర్వాత, ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్ కోసం లాగిన్ పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్​ చేసుకోవాలని కోరుతుంది. గుర్తుంచుకోవడానికి వీలుకాని, ఇతరులు ఊహించడానికి కష్టతరమైన పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసుకోవాలి.
స్టెప్ 9:  మీరు మీ లాగిన్ పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ని సృష్టించిన తర్వాత, మీరు లాగిన్ పేజీకి వెళ్తారు. మీ ఎస్​బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ కావడానికి యూజర్​నేమ్, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్​ చేయండి.
స్టెప్​ 10:  మీ ఖాతాకు లాగిన్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్​ను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్​​ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ ఈ–మెయిల్, సెక్యూరిటీ ప్రశ్నలు వంటి అదనపు సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. మీకు ఏటీఎం కార్డ్ లేకపోతే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎస్​బీఐ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ నుంచి నెట్‌‌‌‌‌‌‌‌బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు.