పీఎం కేర్స్ రూ. 151 కోట్లు ఇచ్చి మైగ్రెంట్ లేబర్స్ నుంచి చార్జీలు వసూలు చేస్తారా ?

పీఎం కేర్స్ రూ. 151 కోట్లు  ఇచ్చి మైగ్రెంట్ లేబర్స్ నుంచి  చార్జీలు వసూలు చేస్తారా ?
  • రైల్వే శాఖ తీరుపై రాహుల్ ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మైగ్రెంట్ లేబర్స్ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారి నుంచి రైలు ఛార్జీలు వసూలు చేయటం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ కు రూ. 151 కోట్లు విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ మైగ్రెంట్స్ లేబర్స్ వద్ద నుంచి మాత్రం ఛార్జీలు వసూలు చేయటం ఏమిటనీ ప్రశ్నించారు. రైల్వే శాఖ వ్యవహారిస్తున్న తీరును విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి వారి నుంచి రైల్వే శాఖ డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా? అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అటు సోనియా సైతం ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కూలీల నుంచి వసూలు చేసే డబ్బును కాంగ్రెస్ పార్టీయే భరిస్తుందని ప్రకటించారు. ఈ వ్యవహారం ముదరటంతో బీజేపీ నేతలు వలస కూలీల ప్రయాణ ఛార్జీల్లో 85 శాతం రైల్వే శాఖ భరిస్తుందని 15 శాతం రాష్ట్రాలు భరించాలని చెబుతున్నాయి.