Fitness Tips: పరగడుపున ఈ నీళ్లు తాగితే.. ఎంత బరువున్న ఇట్టే తగ్గిపోతారు

Fitness Tips: పరగడుపున ఈ నీళ్లు తాగితే.. ఎంత బరువున్న ఇట్టే తగ్గిపోతారు

పులిహోర, పప్పు, ఇతర కూరల్లో చిటికెడు ఇంగువ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాదు రోజూ ఇంగువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది అంటోంది కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ అస్మా అలం. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్న ఇంగువ వల్ల లాభాలివిగో...

• గ్లాసు వేడినీళ్లలో కొంచెం ఇంగువ కలపాలి. ఆ నీళ్లని పరగడుపున తాగాలి. ఇంగువ నీళ్లలో కొంచెం పసుపు కూడా కలిపి తాగొచ్చు.

• ఇంగువ నీళ్లు తాగితే మెటబాలిజం వేగంగా జరుగుతుంది. ఫుడ్ తొందరగా అరుగుతుంది. ఇంగువ వాసన ఆకలిని తగ్గిస్తుంది కూడా. దాంతో ఈజీగా బరువు తగ్గుతారు.

• చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గించే శక్తి ఇంగువకు ఉంది. అంతేకాదు ఇంగువతో కండరాల అలసట తగ్గిపోతుంది కూడా.

* రోజూ ఇంగువ నీళ్లు తాగితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. చర్మం హెల్దీగా ఉంటుంది.