యాపిల్​ కొంటారు..డబ్బులివ్వరు

యాపిల్​ కొంటారు..డబ్బులివ్వరు

పంట బకాయిల విషయంలో ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్​ కేరాఫ్​ అడ్రస్​లా ఉండేది. ఆ రాష్ట్రంలో రైతుల నుంచి టన్నుల కొద్ది చెరకు కొన్న మిల్లుల యజమానులు పైసలు చెల్లించకుండా నెలల తరబడి ఏడిపించుకునేవాళ్లు. ఒక్కోసారి సాగుదార్ల చేతికి సొమ్ములు వచ్చేసరికి సంవత్సరాలు గడిచేవి. ఇప్పుడు ఇలాంటి సమస్యే హిమాచల్​ప్రదేశ్​లోనూ తలెత్తింది. అక్కడ​ రైతుల వద్ద యాపిల్​ పంటను కొంటున్న కమిషన్​ ఏజెంట్లు కూడా యూపీ షుగర్​ ఫ్యాక్టరీల ఓనర్ల బాటలోనే నడుస్తున్నారు. యాపిల్​ పంట బకాయిలు రాక హిమాచల్​ప్రదేశ్​లో 1.7 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

జమ్మూకాశ్మీర్​ తర్వాత యాపిల్​ను ఎక్కువగా సాగు చేసే రాష్ట్రం హిమాచల్​ప్రదేశ్​. ఈ రాష్ట్రంలోని రైతులు తమ పంటకు రావాల్సిన డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. బకాయిల చెల్లింపుల విషయంలో కమిషన్​ ఏజెంట్లు నత్తతో పోటీపడుతున్నారు. రైతులకు ఇవ్వటానికి తమ వద్ద​ క్యాష్​ సరిపడినంత ఉండట్లేదని, పెద్ద నోట్ల రద్దు నాటి నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు. డీమానిటైజేషన్​ జరిగి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ దాన్నే కారణంగా చూపుతుండటం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంచనాలకు మించిన బకాయిలు

హిమాచల్​ప్రదేశ్​లో యాపిల్​ రైతులకు రావాల్సిన బకాయిలు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని కొందరు అంటుండగా, ఈ మొత్తం రూ.1000 కోట్ల పైమాటేనని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. ఈ రెండు అంచనాలూ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావటం గమనార్హం. సీపీఎం అనుబంధ సంస్థ కిసాన్​ సంఘర్ష్ సమితి (కేఎస్​ఎస్​) ‘వంద కోట్లు’గా లెక్క లేస్తే… అధికార బీజేపీకి చెందిన ఫ్రూట్​, వెజిటబుల్స్​ అండ్​ ఫ్లవర్స్​ గ్రోయెర్స్​ అసోసియేషన్​​ (ఎఫ్​వీఎఫ్​జీఏ) ‘వెయ్యి కోట్లు’ అని బల్లగుద్ది చెబుతోంది.  లెక్కల సంగతి ఎలా ఉన్నా యాపిల్​ పంట బకాయిలు రాక హిమాచల్​ప్రదేశ్​లో 1.7 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

హిమాచల్​ప్రదేశ్​లో యాపిల్​ రైతులకు బకాయిలు ఏ మేరకు పేరుకుపోయాయో సరిగ్గా చెప్పటం కష్టం. ఈ​ పంట అమ్మకాలు, కొనుగోళ్లతో రాష్ట్ర సర్కారుకు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవటమే దీనికి కారణం. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోకపోయినా సమస్య పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తోందని సంబంధిత వర్గాల సమాచారం. యాపిల్​ రైతులకు సకాలంలో సొమ్ములు చెల్లించటానికి సరైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని జైరామ్‌ ఠాకూర్‌ (బీజేపీ) ప్రభుత్వం గుర్తించింది.

ఫిర్యాదు​ చేయాలంటే భయం

కమిషన్​ ఏజెంట్ల నుంచి డబ్బులు రాకపోవటంతో లక్షల సంఖ్యలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ.. వాళ్లందరూ అగ్రికల్చర్​ ప్రొడ్యూస్​ మార్కెటింగ్​ కమిటీ (ఏపీఎంసీ)లో కంప్లైంట్​ ఇవ్వటానికి ముందుకు రావట్లేదు. ‘ఇప్పుడు పేమెంట్లు ఆలస్యంగానైనా వస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే అవి పర్మనంట్​గా రాకుండా పోతాయేమో. అసలుకే ఎసరు రావచ్చు’ అని పలువురు భయపడుతున్నారు. అతి కొద్దిమందే  ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంతో నిజంగా బకాయిలు ఎంత ఉన్నాయో వెలుగులోకి రావట్లేదు.

ఇప్పటివరకు 32 మంది యాపిల్​ పెంపకందారులే ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. వాటిల్లోని వివరాలను బట్టి 2017–18 సీజన్లలో చెల్లింపులకు నోచుకోని బకాయిలు సుమారు రూ.2 కోట్లు. ఈ డబ్బు ఇవ్వాల్సిన కమిషన్​ ఏజెంట్లు రైతులకు కనీసం కనిపించకుండాపోతున్న సంఘటనలూ ఉన్నాయి. ‘హిమాచల్​ప్రదేశ్​ అగ్రికల్చరల్​ అండ్​ హార్టికల్చరల్​ ప్రొడ్యూస్​ మార్కెటింగ్​ యాక్ట్​–2005’ ప్రకారం రైతుల నుంచి పంట కొన్న రోజే కమిషన్​ ఏజెంట్లు పేమెంట్లు చేయాలి. నెలలు గడుస్తున్నా పట్టించుకోవట్లేదు.

డీమానిటైజేషన్‌కి ముందు ఇలా లేదు

​2016 నవంబర్​లో పెద్ద నోట్లను రద్దు చేయకముందు పేమెంట్​ సమస్యలు​ లేవు. అప్పట్లో బకాయిలు.. మొత్తం అమౌంట్​లో మహా అయితే పది శాతమే ఉండేవి. పంట కొన్న సమయంలోనే 30–40 శాతం డబ్బు​ ఇచ్చేసేవాళ్లు. డీమానిటైజేషన్​ తర్వాత అంతా తలకిందులైంది. కమిషన్​ ఏజెంట్లు స్పాట్​లో క్యాష్​ ఇవ్వటం మానేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మనీ సర్క్యులేషన్​లో లేకపోవటాన్నే సాకుగా చూపిస్తూ డిలే చేస్తున్నారు. క్యాష్​తో చేసే పెద్ద లావాదేవీలకు ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని అంటున్నారు. డీమానిటైజేషన్‌ జరిగిన ఏడాదికి (2017 చివరలో) జరిగిన ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో వీరభద్రసింగ్‌ (కాంగ్రెస్‌) ఓడిపోయారు. జైరామ్‌ ఠాకూర్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో..  ఏపీఎంసీ కూడా తనవంతు బాధ్యతను నెరవేర్చట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేమెంట్లు పక్కాగా చేయాలని చట్టం చెబుతోంది. కానీ.. ఏపీఎంసీ బోర్డు మెంబర్లు, పొలిటీషియన్లు, కమిషన్​ ఏజెంట్ల మధ్య బలమైన సంబంధాలు ఉండటంతో వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతోంది. రైతుల తరఫున నిలబడి పోరాడేవాళ్లు కనిపించట్లేదు.

సగం షేరు యాపిల్ దే

హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం జిల్లాల సంఖ్య 12. ఇందులో దాదాపు సగం జిల్లాల్లో యాపిలే ప్రధాన వాణిజ్య పంట. షిమ్లా , కన్నౌర్ , కులు, మండి, ఛంబా జిల్లాలతోపాటు సిర్ మౌర్ , లహౌల్ –స్పితి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా యాపిల్  పండిస్తా రు. యాన్యువల్  ప్రొడక్షన్ ఐదు లక్షల టన్నులు. ఎస్టిమేటెడ్ ఎకానమీ రూ.3500 కోట్లు. పండ్ల పంటలు వేసే టోటల్ ఏరియాలో దాదాపు సగం ప్రాంతంలోయాపిలే సాగు చేస్తారు. మొత్తం పండ్ల ఉత్పత్తిలో 85 శాతం ఈ పంటదే. రాష్ట్రంలో పండేయాపిల్ ను దేశంలోని వివిధ రాష్ట్రా లకు,ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.

రైతుల పక్షాన ఒకే ఒక్కడు

ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో ఈసమస్య తెరపైకి రాకపోవటం రైతులదురదృష్టం . బీజేపీ గానీ కాం గ్రెస్ గానీ దీన్నితమ అజెండాల్లో చేర్చలేదు. ఒక్క ఎమ్మెల్యే తప్ప ఎవరూ ఈ అంశాన్ని అసెంబ్లీ లో ప్రస్తావిం చలేదు. సీపీఎం సభ్యుడు రాకేశ్ సిం ఘా మాత్రమే యాపిల్ రైతుల పక్షాన గళం వినిపిం చాడు. వాళ్లను ఏకం చేశాడు.ఇన్నాళ్లూ కమిషన్ ఏజెంట్ల ఆగడాలను ప్రశ్నిం చాలంటే సాగుదార్లు భయపడేవాళ్లు. సింఘా అండగా నిలవటంతో సమస్య పరిష్కారమయ్యే  వరకు వెనకాడబోమని అంటున్నారు.

 

రైతుల ఇబ్బందులను తీర్చటమనేది రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాన కర్తవ్యం. ప్రభుత్వం తన బాధ్యతను మరిచింది కాబట్టి,  శాసనసభ లోపల, బయట సర్కారును నిలదీయాల్సిన  ప్రతిపక్ష కాంగ్రెస్​  ఆ పని చేయలేకపోయింది.  ఎలక్షన్ ఇష్యూగా మార్చటంలో ఫెయిల్​ అయింది. కేఎస్​ఎస్​, ఎఫ్​వీఎఫ్​జీఏ వంటి ఆర్గనైజేషన్లు ఒత్తిడి పెంచటంతో హిమాచల్​ప్రదేశ్​ గవర్నమెంట్​లో కదలిక వచ్చింది. సమస్య పూర్వాపరాలను తెలుసుకునేందుకు స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం(సిట్​)ను ఏర్పాటు చేసింది.

– ‘ది వైర్​’ సౌజన్యంతో