
హైదరాబాద్, వెలుగు: గేమర్స్,కంటెంట్ క్రియేటర్ల కోసం ఏఐ- ఫీచర్లతో రూపొందించిన ల్యాప్‌టాప్‌లను హెచ్‌పీ శనివారం విడుదల చేసింది. కొత్తగా తీసుకొచ్చిన ల్యాప్‌టాప్‌లలో హెచ్‌పీ ఓమెన్ట్రాన్సెండ్–14 , ఎన్వీ ఎక్స్360– 14 ఉన్నాయి. వీటిలో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌లు ఉండటం వల్ల హై-ఎండ్ గేమింగ్ క్రియేషన్ అనుభవం సాధ్యమవుతుంది. వీటి ధరలు వరుసగా రూ.లక్ష, రూ.1.75 లక్షలని హెచ్‌పీ తెలిపింది. హెచ్‌పీ ఓమెన్ ట్రాన్సెండ్ సిరామిక్ వైట్, షాడో బ్లాక్ రంగుల్లో, హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 మెటియర్ సిల్వర్, అట్మాస్ఫియరిక్ బ్లూ రంగుల్లో లభిస్తాయి. పలు ఏఐ ఫీచర్లు, 11.5 గంటల బ్యాటరీ లైఫ్, 140 వాట్ల అడాప్టర్, కీబోర్డ్‌లో మైక్రోసాఫ్ట్ కోపైలట్ బటన్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, ఏఐ నాయిస్ రిమూవల్ వంటి ఫీచర్లు వీటి సొంతం.