Cricket World Cup 2023: కివీస్‌తో కష్టమే: న్యూజిలాండ్‪కి అనుకూలంగా ధర్మశాల పిచ్

Cricket World Cup 2023: కివీస్‌తో కష్టమే: న్యూజిలాండ్‪కి అనుకూలంగా ధర్మశాల పిచ్

వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ ( అక్టోబర్ 22) కీలకమైన న్యూజీలాండ్ తో పోరుకు సిద్ధమైంది. సాధారణంగా భారత్ పిచ్ లంటే టీమిండియాకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా స్పిన్ కు అనుకూలంగా ఉండడం, మన పిచ్ ల మీద పూర్తి అవగాహనా కలిగి ఉండడం కలిసి వచ్చే అంశం. దీంతో సొంతగడ్డపై సహజంగా ఆతిధ్య జట్టు చెలరేగుతుంది. కానీ వాటన్నిటికీ భిన్నంగా ధర్మశాల పిచ్ భారత్ కంటే కివీస్ కే ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. దానికి కారణమేంటో చూద్దాం. 

హిమాచల్ ప్రదేశ్ లోని వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు మనకు కొంచెం  కష్టంగా ఉన్నా.. న్యూజీలాండ్ కి మాత్రం అలవాటే.  ఇక్కడ పిచ్ లు కొంతవరకు న్యూజీలాండ్ పిచ్ లను పోలి ఉంటాయి. స్వింగ్ కి ఎక్కువగా అనుకూలించే ఈ పిచ్ ల మీద కివీస్ పేస్  ద్వయం బౌల్ట్, సౌథీ చెలరేగితే భారత్ కు ఇబ్బందుకు తప్పవు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో మనకు రోహిత్, గిల్, కోహ్లీ లాంటి  కీలక ప్లేయర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. పిచ్ స్వభావాన్ని బట్టి ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు  అనుకూలిస్తుంది. ఈ వేదికలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 231 కాగా.. రెండవ ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 199. ఈ వరల్డ్ కప్ లో చివరిసారిగా సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగ్గా 245 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు ఛేజ్ చేయలేకపోయారు.