14 శాతం ప్రీమియంతో లిస్టయిన హెచ్​ఆర్​హెచ్​ నెక్ట్స్

14 శాతం ప్రీమియంతో లిస్టయిన హెచ్​ఆర్​హెచ్​ నెక్ట్స్

హైదరాబాద్,  వెలుగు : నగరానికి చెందిన హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ నెక్స్ట్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు ధర బుధవారం ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈలో ప్రీమియంతో అడుగుపెట్టింది. ఒక్కో షేరు రూ.41 చొప్పున లిస్ట్​ అయింది. ఇది ఇష్యూ ధర రూ.36 కంటే 13.89శాతం ఎక్కువ. 

హెచ్ఆర్​హెచ్​ నెక్స్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ డిసెంబర్ 27న మొదలయింది. అదే నెల 29న ముగిసింది. హెచ్​ఆర్​హెచ్​ నెక్స్ట్ సర్వీసెస్ ఐపీఓ ప్రైస్​ బ్యాండ్​ను రూ.36గా నిర్ణయించారు.  ఇది ఈ–మెయిల్, వాయిస్, చాట్ ద్వారా బ్యాకెండ్ మద్దతును అందించే బిజినెస్ ​ప్రాసెసింగ్​అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ (బీపీఓ) కంపెనీ.