
జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2’ (War 2). కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరెకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్తో భారీస్థాయిలో అంచనాలు పెంచిన మేకర్స్.. లేటెస్ట్గా ట్రైలర్తో ఇచ్చిపడేశారు.
‘తుఫానుకు సిద్ధంగా ఉండండి, యుద్ధం ఇప్పుడే ప్రారంమైంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో హిందీ, తెలుగు & తమిళ భాషలలో విడుదలవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ల యుద్ధం చూసుటకై మీ రెండు కళ్లు చాలవని’ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ వెల్లడించింది.
నెవెర్ బిఫోర్ అనేలా..హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇద్దరు సోల్జర్స్ మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ట్రైలర్‌ను కట్ చేశారు. హృతిక్ రోషన్‌తో కియారా లిప్ లాక్ సీన్‌తోపాటు చేసిన యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి.
'నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను.. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడతాను.. అలాగే ' మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను' అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ మెప్పిస్తున్నాయి.
ఇకపోతే, వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండటం, సూపర్ హిట్ 'వార్' సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ వస్తుండటం సినీ వర్గాల్లో అంచనాలు పెరిగాయి.