Fighter Release Ban: అక్కడ ఫైటర్ మూవీ బ్యాన్..కారణం ఏంటంటే?

Fighter Release Ban: అక్కడ ఫైటర్ మూవీ బ్యాన్..కారణం ఏంటంటే?

బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకోన్ (Deepika Padukone) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్‌(Fighter). వార్‌, పఠాన్ వంటి యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దేశభక్తి బ్యాక్డ్రాప్ లో..అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సీనియర్ హీరో అనిల్‌ కపూర్‌ కీ రోల్ లో పాత్ర పోషిస్తున్న ఈ సినిమా..రిపబ్లిక్ డే సందర్బంగా రేపు (జనవరి 25న) ప్రేక్షకుల ముందుకు రానుంది.  

రిలీజ్ కు ఒక్కరోజు ముందే..ఈ సినిమాకు షాక్ తగిలింది. UAEలో ఫైటర్ మూవీ PG 15 వర్గీకరణతో సెన్సార్‌ను ఆమోదించింది. జనవరి 10, 2024న గల్ఫ్లో సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది, జనవరి 23న దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో ఫైటర్ విడుదల కావడం లేదని ప్రకటించారు. ఇలా బ్యాన్ చేయడం ఫైటర్ మేకర్స్‌కు దారుణమైన ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. GCC సెన్సార్లు గల్ఫ్ దేశాల్లో సెన్సార్‌ క్లియరెన్స్ నిరాకరించినందుకు ఫైటర్ మూవీకి..500k నుండి 1 మిలియన్ డాలర్ల వరకు నష్టం రావొచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

యూఏఈ మినహా మిగిలిన గల్ఫ్ దేశాలన్నింట్లోనూ ఈ సినిమాపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్-పాకిస్థాన్ వివాదాల లాంటి అంశాలతో తీసిన చిత్రాల్ని..అలాగే స్వలింగ సంపర్కుల హక్కుల వంటి సన్నివేశాలుంటే గల్ఫ్ దేశాల్లో సినిమాలు బ్యాన్ చేస్తుంటారు. రీసెంట్ గా సల్మాన్ 'టైగర్ 3', మలయాళ మెగాస్టార్ నటించిన కాదల్ ది కోర్ మూవీస్ అక్కడ నిషేదానికి గురయ్యాయి.

‘ఫైటర్’ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ స్టార్ట్ చేసిన మార్ఫ్‌లిక్స్ పిక్చర్స్‌తో పాటు వియాకోమ్18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించింది. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన ‘పఠాన్’తో గతేడాది భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్ధార్థ్ ఆనంద్.