Fighter Movie X Review: దేశభక్తి కాన్సెప్ట్తో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్.. రిజల్ట్ ఏంటి?

Fighter Movie X Review: దేశభక్తి కాన్సెప్ట్తో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్.. రిజల్ట్ ఏంటి?

Fighter: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్(Fighter). స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్(Siddarth Anand) తెరకెక్కించిన ఈ  మూవీలో దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరో అనిల్ కపూర్(Anil Kapoor) కీ రోల్ లో కనిపించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లగా.. గణతంత్ర దినోత్సవ సందర్బంగా జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే చాలా చోట్ల ఫైటర్ మూవీ ప్రీమియర్ షో పూర్తవగా సినిమా చూసిన ఆడియన్స్, హ్రితిక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి ఫైటర్ సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

ఫైటర్ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఫైటర్ సినిమా నెక్స్ట్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ, ప్రెజెంటేషన్, VFX, బీజీఎమ్,యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ సాలిడ్ గా ప్లాన్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ తో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చూడటం చాలా కొత్త అనుభూతిని కలిగించిందని చెప్పుకుంటున్నారు. ఇక హ్రితిక్ అద్భుతంగా నటించాడని, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడని చెప్తున్నారు. 

ఇక మొత్తంగా ఈ గణతంత్ర దినోత్సవ సందర్బంగా ప్రతీ భారతీయుడు చూడాల్సిన సినిమా ఫైటర్ అని మరికొంతమంది అంటున్నారు. ఇక మొత్తంగా ఫైటర్ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. మరి మొత్తంగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.