హృతిక్ రోషన్ డిజిటల్ డెబ్యూ.. అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్..

హృతిక్ రోషన్ డిజిటల్ డెబ్యూ.. అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌‌‌‌.. ‘క్రిష్‌‌‌‌ 4’ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకేసి నిర్మాతగా డిజిటల్ డెబ్యూ ఇస్తున్నారు. ప్రైమ్‌‌‌‌ వీడియో ఇండియాతో కలిసి హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌ ఫిల్మ్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై హృతిక్ ఓ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నిర్మించబోతున్నారు.  ‘స్ట్రోమ్‌‌‌‌’ వర్కింగ్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో రూపొందుతున్న ఈ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు ‘టబ్బర్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ అజిత్ పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు.  

హృతిక్ లవర్‌‌‌‌‌‌‌‌ సజా అజాద్‌‌‌‌, మలయాళ హీరోయిన్‌‌‌‌ పార్వతి తిరువోతుతో పాటు అలయా ఎఫ్‌‌‌‌, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముంబై బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే హై స్టేక్స్‌‌‌‌ థ్రిల్లర్ డ్రామా ఇది. తన డిజిటల్ డెబ్యూకి ఇది సరైన ప్రాజెక్ట్‌‌‌‌గా భావిస్తున్నట్టు హృతిక్ చెప్పారు. 

రియలిస్టిక్‌‌‌‌ స్టోరీ,  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో ఇది రాబోతోందని, ఇందులోని క్యారెక్టర్స్‌‌‌‌ అన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయని హృతిక్ వెల్లడించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌‌‌‌ స్ట్రీమింగ్ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేస్తామని ప్రైమ్ వీడియోస్ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ గౌరవ్ గాంధీ తెలియజేశారు.