తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామి వారి సర్వదర్శనానికి సుమారు 15 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారిని 73 వేల 16 మంది భక్తులు దర్శించుకున్నారు. 4 కోట్ల 9 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు సర్వదర్శనానికి స్లాట్ విధానాన్ని తిరిగి ప్రారంభించే యోచన చేస్తుంది టీటీడీ. భక్తులు స్లాట్ విధానాన్నే కోరుకుంటున్నారని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీన పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రోజుకు లక్షమంది భక్తుల వస్తుండటంతో వసతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జూన్ నెలలో మొత్తం 23 లక్షల 23 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 123 కోట్ల 74 లక్షలు వచ్చిందన్నారు. 11 లక్షల 61 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని ఆలయ ఈవో తెలిపారు.