విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్దమైన డైనో పార్క్.. 

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్దమైన డైనో పార్క్.. 

విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్కులో అగ్నిప్రమాదం సంభవించటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు వ్యాపించటంతో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది.విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

పార్కు సిబ్బంది ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమి జారకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.