ఫర్నిచర్ షోరూమ్​లో భారీ అగ్ని ప్రమాదం..

ఫర్నిచర్ షోరూమ్​లో భారీ అగ్ని ప్రమాదం..
  •  పక్కనే ఉన్న 3 షాపులకు వ్యాపించిన మంటలు
  • 4  ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

కూకట్ పల్లి, వెలుగు: ఫర్నిచర్ షోరూంలో అగ్ని ప్రమాదం ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్​లోని ఎమ్ఎస్ ఫర్నిచర్ షోరూమ్​లో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ షోరూమ్​పైన రెండంతస్తుల్లోని షాపులకు, గ్రౌండ్​ ఫ్లోర్​లోని చెప్పుల దుకాణానికి మంటలు వ్యాపించాయి.

స్థానికులు భయాందోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.