హుస్సేన్ సాగర్ కు పెరిగిన వరద

హుస్సేన్ సాగర్ కు పెరిగిన వరద

హైదరాబాద్, వెలుగు : హుస్సేన్ సాగర్ కు వరద పెరుగుతుండగా.. నిండుకుండలా మారింది.  భారీగా వరదనీరు చేరుతుండగా ఎప్పటికప్పుడు నీటిని అధికారులు  బయటకు వదులుతున్నారు. సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని బల్దియా ఇంజనీరింగ్  అధికారులు నిత్యం పరిశీలిస్తున్నారు.  

సాగర్ ఎఫ్ టీఎల్ లెవల్ 513.41 మీటర్లు కాగా.. శనివారం సాయంత్రానికి నీటిమట్టం 513.60 మీటర్లకు చేరింది. బుధవారం సాయంత్రానికి ఇన్ ఫ్లో 2500 , ఔట్ ఫ్లో 2300 క్యూసెక్కులుగా ఉంది.