శాంసంగ్కు భారీ నష్టం.. 14ఏళ్లలో ఇదే తొలిసారి 

శాంసంగ్కు భారీ నష్టం.. 14ఏళ్లలో ఇదే తొలిసారి 

ప్రపంచ వ్యాప్తంగా శాంసంగ్ కంపెనీకి ఉన్న బ్రాండ్ వాల్యూ అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ లో ఎన్ని బ్రాండ్స్ వచ్చినా.. మార్కెట్ ను తట్టుకుని నిలబడింది శాంసంగ్. మొబైల్ మార్కె్ట్ లో యాపిల్ కంపెనీకి సైతం పోటీనిచ్చింది. ఎలక్ట్రానిక్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదిగింది. అయితే, ప్రస్తుతం ఆ కంపెనీ నష్టాల్లో నడుస్తోంది. 

గతేడాదితో పోలిస్తే శాంసంగ్ త్రైమాసిక లాభం రికార్డ్ స్థాయిలో పడిపోయింది. లాభం 640 బిలియన్ వాన్ (రూ.3వేల కోట్ల పైనే) తగ్గింది. ఈ నష్టం దాదాపు 95శాతం ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. నికర ఆదాయం 86.1 శాతం తగ్గి, 1.57 ట్రిలియన్ వాన్కు (రూ.95వేల కోట్లపైనే) చేరింది. సేల్స్ 18శాతం తగ్గాయి. దాంతో 63.75 ట్రిలియన్ వాన్ (రూ.3.8లక్షల కోట్లు) నమోదైంది. ఓ త్రైమాసికంలో ఈ స్థాయి నష్టం రావడం 14 ఏళ్లలో శాంసంగ్ సంస్థకు ఇదే తొలిసారి.