జూ పార్క్ కు పోటెత్తిన హైదరాబాద్ వాసులు.. ఒక్కరోజే 30వేల మంది విజిట్

జూ పార్క్ కు పోటెత్తిన హైదరాబాద్ వాసులు.. ఒక్కరోజే 30వేల మంది విజిట్

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ జూ పార్క్(నెహ్రు జులజికల్ పార్క్)కు సందర్శుకుల తాకిడి పెరిగింది. ఎండాకాలం పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో జూ పార్క్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి జూ పార్క్ లో రకరకాల పక్షులు, జంతువులను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు.  

మే 27వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్క రోజే 30 వేల361 మంది సందర్శకులు జూ పార్క్ ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. పిల్లలు, పెద్దలు అందరూ జూ పార్క్ ని సందర్శించి సరదా గడిపారు.  సందర్శకుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో ముందస్తుగా జూ సిబ్బంది టికెట్ కౌంటర్ ల సంఖ్య పెంచి రద్దీ పెరగకుండా జాగ్రత్త పడింది. సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు.