మణికొండలో భారీ కొండ చిలువ.. జనం పరుగులు

మణికొండలో భారీ కొండ చిలువ.. జనం పరుగులు

రంగారెడ్డి జిల్లాలో 12 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. మణికొండ మున్సిపాలిటీ  పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో కొండ చిలువ సంచరించింది.  కొండచిలువ  ఒక్కసారిగా  కనిపించడంతో  స్థానికులు  భయాందోళనకు గురై పరుగులు తీశారు.

వెంటనే అక్కడి కాలనీవాసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్  కొండ చిలువను తాను తెచ్చుకున్న సంచిలో  బంధించి   అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.  దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.