సూర్యాపేట, వెలుగు: జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో సూదబత్తుల నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, నూకలు తయారుచేసే మిషన్ ని పట్టుకున్నామన్నారు.
రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి తన ఇంట్లోనే మిషన్ ఏర్పాటుచేసి వాటిని నూకలుగా తయారుచేస్తున్నాడు. సమాచారం రావడంతో దాడులు చేయగా, 5 క్వింటాళ్ల 50 కేజీల రేషన్ బియ్యం, 5 క్వింటాళ్ల 50 కేజీల నూకలు, మిషన్ ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజాపంపిణీ బియ్యాన్ని ఎవరైనా దుర్వియోగం చేసి పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య హెచ్చరించారు.
