V6 News

వికారాబాద్ వాసులు విలవిల... ఒకవైపు వర్షం, మరోవైపు పెట్రోల్ కష్టాలు...

వికారాబాద్ వాసులు విలవిల... ఒకవైపు వర్షం, మరోవైపు పెట్రోల్ కష్టాలు...

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా మాడుపగిలే ఎండ, వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూల్ అయ్యింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్లబడిందని ఆనందించేలోపే పెట్రోల్ కష్టాలు వెక్కిరిస్తున్నాయి. సిటీలో చాలా చోట్ల స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతబడటంతో తెరిచి ఉన్న బంకుల దగ్గర రద్దీ పెరిగింది.. వాహనదారులు బారులు తీరారు. 

వికారాబాద్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. వికారాబాద్ లో కూడా పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీరారు.

ఒకవైపు వర్షం, మరోవైపు పెట్రోల్ కోసం క్యూలో వెయిట్ చేయడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు జనం. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. వర్షంలోను పెట్రోల్ కోసం  పలు బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు.జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టగా పలు బంకుల్లో పెట్రోల్ కోసం రద్దీ కొనసాగుతుంది.