బన్నీ థియేటర్లో ఆదిపురుష్కు భారీ రెస్పాన్స్

బన్నీ థియేటర్లో ఆదిపురుష్కు భారీ రెస్పాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) "ఏఏఏ సినిమాస్(AAA Cinemas)" పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తన్న సంగతి తెలిసిందే. అమీర్ పేట్ లో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఏసియన్ గ్రూప్స్(Asian groups) ఇంకా అల్లు అర్జున్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఇటీవలే పూర్తయ్యింది. ఈ మల్టీప్లెక్స్ ను ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ స్పెషల్ మూవీ ఆదిపురుష్(Adipurush) తో ప్రారంభించనున్నారు.

దీంతో ఏఏఏ సినిమాస్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్(Allu arjun fans), మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్(Pabhas fans) ఆదిపురుష్ సినిమాను ఏఏఏ సినిమాస్ లో చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఏఏఏ సినిమాస్లో ఆదిపురుష్ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.

జూన్ 16న ఆదిపురుష్ మూవీ రిలీజ్ కానుండగా.. జూన్ 14న హైదరాబాద్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక  ఏఏఏ సినిమాస్ లో బుకింగ్స్ ఓపెన్ ఐన క్షణాల్లోనే టికెట్స్ అన్ని అమ్ముడైపోయాయి. ఇప్పటికే ఏఏఏ సినిమాస్ లో మొదటి వీకెండ్ కు సంబందించిన టికెట్స్ అన్ని అమ్ముడయ్యాయట. దీంతో ఏఏఏ సినిమాస్ ఓపెన్ అయిన రోజే రికార్డ్ కలెక్షన్స్ రావడం ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రభాస్ అండ్ బన్నీ ఫ్యాన్స్.