తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో లేపాక్షి సర్కిల్ దాటుకుని రాంభగీచా బస్టాండ్ వరకు క్యూలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గోవింద నామస్మరణలో తిరుమల మార్మోగుతోంది. ఈనెలాఖరు వరకు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంటుందన్నారు టీడీడీ అధికారులు.