కేదార్‌నాథ్‌లో భారీ స్కాం.. 228 కేజీల గోల్డ్ మిస్సింగ్ : జ్యోతిర్‌మ‌ఠ శంక‌రాచార్య

కేదార్‌నాథ్‌లో భారీ స్కాం..  228 కేజీల గోల్డ్ మిస్సింగ్ : జ్యోతిర్‌మ‌ఠ శంక‌రాచార్య

 కేదార్‌నాథ్‌లో భారీ గోల్డ్ స్కాం జ‌రిగిందని జ్యోతిర్‌మ‌ఠ శంక‌రాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి అన్నారు. కేదార్‌నాథ్ ఆల‌యం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వ‌ర‌కు ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌ర‌గ‌లేద‌న్నారు. దీనికి ఎవ‌రు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని ర‌కాల స్కామ్‌ల‌కు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆల‌యాన్ని క‌డుతామ‌ని అన‌డ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని ఆయ‌న ప్రశ్నించారు.

ALSO READ | పూరీ రత్నభాండాగారం ఓపెన్..పెట్టెల నిండా నగలు.!

ప్రధాని మోదీ త‌న‌కు ప్రణామాలు చేశార‌ని, త‌మ ద‌గ్గరికి వ‌చ్చిన‌వాళ్లను దీవించ‌డం త‌మ విధాన‌మ‌ని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ త‌మ‌కు శ‌త్రువు కాదు అని, ఆయ‌న శుభం కోరుకునేవాళ్లమ‌ని, ఆయ‌న సంక్షేమం గురించి ఆలోచిస్తామ‌ని, ఒక‌వేళ ఆయ‌న త‌ప్పు చేస్తే, ఆ విష‌యాన్ని మేం ఎత్తి చూపుతామ‌ని అవిముక్తేశ్వరానంద తెలిపారు.