మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని నెలలుగా కేసుల సంఖ్య తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనానికి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవిడ్ మహమ్మారి ముంబయిని మరోసారి వణికిస్తోంది. మంగళవారం ఒక్కరోజే నగరంలో 506 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 6  తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ముంబయిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,526గా ఉంది. పాజిటివిటీ రేటు 6 శాతానికి పెరగడంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. టెస్టుల సంఖ్య భారీగా పెంచారు. వర్షాకాలం ప్రారంభం కానుండటంతో కేసులు మరింత పెరిగే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

ముంబయిలో ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్లో 1,822 కేసులు నమోదుకాగా.. మేలో ఆ సంఖ్య 5,979కు చేరింది. అయితే గత నెలలో కరోనా బారినపడి ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం కరోనా పేషెంట్ల కోసం ముంబైలో  24,472 బెడ్లు అందుబాటులో ఉండగా.. 90 మంది పేషెంట్లు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు కరోనా బులెటిన్లో వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం..

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్