కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టిన బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!హంబుల్ ఫ్లేవర్స్.. పిల్లల కోసం హెల్దీ శ్నాక్స్

 కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టిన బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!హంబుల్ ఫ్లేవర్స్.. పిల్లల కోసం హెల్దీ శ్నాక్స్

ఎంబీఏ పూర్తయ్యాక కార్పొరేట్ ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి ఎంతోమంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పాఠాలు చెప్పింది. కానీ.. తల్లి అయ్యాక పిల్లల కోసం వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి వచ్చింది. కానీ.. పిల్లలు స్కూలుకు వెళ్లాక ఖాళీగా ఉండలేక వంటల్లో ప్రయోగాలు చేసింది. పిల్లల కోసం చాక్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లడ్డూలు, పెద్దల కోసం హెల్దీ శ్నాక్స్ తయారు చేసింది. వాటినే ఇప్పుడు ‘హంబుల్ ఫ్లేవర్స్’ ద్వారా అమ్ముతూ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగింది రిచా. 

రిచా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అజ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటినుంచి వంట చేయడం అంటే ఇష్టం. వాళ్ల అమ్మ అనితా శర్మ బాగా చదువుకుంది. కొన్నాళ్లు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసింది. తర్వాత రిచా వాళ్ల నాన్నకు వేరే ప్రాంతానికి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ కావడంతో అనిత ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుంది. అప్పుడు ఆమెకు కావాల్సినంత ఖాళీ టైం దొరికింది. అందుకే రిచాకు రకరకాల వంటకాలు చేసి పెట్టేది. అనిత వంట చేస్తుంటే రిచా ఆమె పక్కనే నిలబడి ఇంగ్రెడియంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి అడిగి తెలుసుకునేది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడే వాళ్ల అమ్మని అడిగి ఎన్నో వంటకాల గురించి తెలుసుకుంది. అమ్మ చెప్పిన ఆ వంట పాఠాలే ఆమెతో రకరకాల ప్రయోగాలు చేయించాయి. కుకింగ్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి. 

కార్పొరేట్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రిచా 2008లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత వడోదరలో కార్పొరేట్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. 2009లో పెండ్లి చేసుకుని ఒక మార్వాడీ కుటుంబానికి కోడలైంది. అప్పటినుంచి భర్తతోపాటు దేశమంతా తిరిగింది. అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసింది. చిరవకు 2012లో వడోదరలోని పారుల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేరింది. మరుసటి ఏడాది తల్లి అయ్యింది. 2016లో తన భర్తకు ముంబైకి ట్రాన్స్​ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. దాంతో ఉద్యోగం వదిలేసి అతనితోపాటు ముంబైకి మారింది. అప్పటినుంచి పిల్లల కోసం ఇంటికే పరిమితమైంది. 

పిల్లల కోసం.. 

సాధారణంగా పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పెద్దగా నచ్చవు. కానీ, చాక్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటివాటిని బాగా ఇష్టపడతారు. అందుకే రిచా చాక్లెట్ల లాంటి లడ్డూలు చేయాలి అనుకుంది. అందుకోసం ఎన్నో ప్రయోగాలు చేసింది. చివరికి డ్రై ఫ్రూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెత్తగా రుబ్బి వాటితో లడ్డూలు చేసింది. చాక్లెట్ టేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొద్దిగా కోకో పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిపింది. అంతే.. పిల్లలకు ఆ లడ్డూ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోయింది. అప్పటినుంచి ఆర్డర్లు బాగా పెరగడంతో భర్త సాయంతో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అప్పటినుంచి ఆర్డర్లు మరింత పెరిగాయి. దాంతో రిచాకు ఒంటరిగా పనిచేయడం కష్టమైంది. తన కొడుకును చూసుకోవడానికి పనిలో పెట్టుకున్న హెల్పర్ స్వాతిని తనతో చేర్చుకుంది. అప్పటివరకు తన కొడుకుని జాగ్రత్తగా చూసుకున్న స్వాతి అప్పటినుంచి బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని జాగ్రత్తగా చూసుకుంటోంది. స్వాతి గతంలో ఇండ్లలో ఊడ్చడం, తుడవడం లాంటి పనులు చేసేది. ఇప్పుడు హంబుల్ ఫ్లేవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరి ఆర్థిక స్వాతంత్ర్యం పొందింది. ‘‘కొడుకు పెద్దయ్యాక, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అని భయపడ్డాను. కానీ.. రిచా మేడమ్ నన్ను తన స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకున్నారు. నాకు ఇంతకుముందు లడ్డూల  గురించి పెద్దగా  తెలియదు. మేడమ్ నాకు అన్నీ నేర్పించారు. నేను చేసిన లడ్డూలు చాలా ఇళ్లకు చేరుతున్నందుకు నాకు గర్వంగా ఉంది’’ అని చెప్పింది స్వాతి. ఇప్పుడు ఆమెతో పాటు మరో ముగ్గురు రిచాతో కలిసి పనిచేస్తున్నారు.

కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో.. 

రిచా బిజినెస్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఊహించని విధంగా కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ టైంలో అందరూ ఇండ్లకే పరిమితం కావడంతో, రిచా చాలామందికి తన హోం మేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డెలివరీ చేసింది. మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, చేతి గ్లౌవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టుకుని చాలా జాగ్రత్తగా వంటలు చేసేది. ముఖ్యంగా కరోనాతో బాధ పడుతున్నవాళ్లకు హెల్దీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పంపింది. రుచికరమైన మార్వాడీ భోజనం నుంచి న్యూట్రియెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లడ్డూల వరకు అన్నీ ఇంట్లోనే చేసేది. తన తల్లి దగ్గర నేర్చుకున్న చాలా వంటలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ‘నా బ్రాండ్ పెరుగుతున్నా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలి అనుకోలేదు. నా వంటగదిలో మెషిన్లు ఉండడాన్ని నేను ఊహించలేను. అందుకే ఇప్పటికీ ప్రతిదీ చేతితోనే తయారుచేస్తున్నా. డెలివరీ చేయగలిగేవరకే ఆర్డర్లు తీసుకుంటున్నా’ అంటోంది స్వాతి. ప్రమోషన్, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఖర్చు చేయకుండానే ఇప్పుడు హంబుల్ ఫ్లేవర్స్ గురించి దేశమంతా తెలిసింది. దేశ నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అంతేకాదు.. రిచా 2023లో ‘ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్– హోమ్ బిజినెస్’ అవార్డును కూడా గెలుచుకుంది.

ఒత్తిడి తగ్గేంచేది.. 

‘‘ఉద్యోగం మానేసిన తర్వాత మూడేళ్ల నా బిడ్డని చూసుకోవడమే పనిగా పెట్టుకున్నా. ఖాళీ టైంలో మాత్రం వంట మీద దృష్టి పెట్టాను. కుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా ఒత్తిడిని చాలావరకు తగ్గించేది. అందుకే అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కూడా వంట చేసేదాన్ని. ముఖ్యంగా వీకెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధోక్లాలు, రాజస్థానీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కచోరీలు, సబ్జీలు, హెల్దీ లడ్డూలు చేసి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పంపేదాన్ని. వాటిని తిన్నవాళ్లంతా నా వంటను బాగా మెచ్చుకున్నారు. దాంతో 2019 ఏప్రిల్​లో ఫుడ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని నిర్ణయించుకున్నా. కానీ.. మొదట్లో ముంబై లాంటి సిటీల్లో ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కొదవ ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో చేసే నా వంటకాలు ఎవరు కొంటారు? అనిపిం చేది. కానీ.. నా భర్త, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం బాగా సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దాంతో ‘హం బుల్ ఫ్లేవర్స్’ పేరుతో స్టార్టప్ పెట్టి, నా మొదటి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా. ఆ క్షణం నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడలేదు” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చింది రిచా.