హైదరాబాద్ మియాపూర్ లో గుళ్ళలో హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు.. ఒక్క నెలలోనే మూడుసార్లు..

హైదరాబాద్ మియాపూర్ లో గుళ్ళలో హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు..  ఒక్క నెలలోనే మూడుసార్లు..

హైదరాబాద్ లోని మియాపూర్, చందానగర్ లోని గుళ్ళల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు గుళ్ళలో చోరీ జరగటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మియాపూర్, చందానగర్ ప్లోస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు దుండగులు. చందానగర్, మియాపూర్ లో ఉన్న సాయిబాబా గుళ్ళలో హుండీలను ఎత్తుకెళ్లారు దుండగులు. 

రెండు ఏరియాల్లో సాయిబాబా గుళ్ళలోనే చోరీ జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు ఘటనలు ఒక ముఠా పనేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు ఆలయాల అర్చకులు. అర్చకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. 

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. చందానగర్, మియాపూర్ పరిధిలో దేవాలయాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని.. నెలరోజుల్లోనే మూడు దొంగతనాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. అయితే.. నిందితులను ఇప్పటిదాకా పెట్టుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు, స్థానికులు. గుళ్ళకే భద్రత లేకుంటే ఇక సామాన్యుల ఇళ్లకు ఏం భద్రతా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. 

నెలరోజులుగా జరుగుతున్న వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని.. దుండగులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతన్నారు స్థానికులు. కొంతకాలంగా వరుస చోరీలు జరుగుతున్న క్రమంలో తమ ఏరియాల్లో భద్రత పెంచాలని కోరుతున్నారు స్థానికులు.